NBK 109వ మూవీకి టైటిల్ ఫిక్స్.. ఇకనుంచి ఊచకోత స్టార్ట్..!

lakhmi saranya
కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. నందమూరి రామారావు వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన బాలయ్య ప్రెసెంట్ కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల భగవంత్ కేసరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలకృష్ణ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ నటులు ఊర్వసి అండ్ బాబీ డియల్ ముఖ్యపాత్రలో దర్శకుడు బాబీ డైరెక్షన్లో ఓ యాక్షన్ చిత్రం చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం బాలయ్య కెరీర్లో 109వ చిత్రంగా రూపొందుతుంది. ఇక ఇప్పుడు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా గత కొద్ది రోజులు నుంచి ఈ సినిమా టైటిల్ విషయంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీకి మొదటిగా వీర మాస్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అది నిజం కాదంటూ ఇప్పుడు మరికొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీజర్ లిమ్స్ లో చూపించినట్టుగా అసురుడు తరహాలో ఒక టైటిల్ పెట్టే ఛాన్సెస్ ఉందని లేటెస్ట్ వినికిడి కాగా దీనితో పాటుగా డెమోన్ అనే టైటిల్ కూడా బాగుంటుందని అభిమానులు అంటున్నారు.
మొత్తానికి అయితే దర్శకుడు ఏ టైటిల్ ని ఫిక్స్ చేశారు అనేది మరి కొంతకాలం లో తెలియనిది. ఇక ఇటీవలే పాలిటిక్స్లో ఫుల్ బిజీగా గడుపుతున్న బాలయ్య మరికొన్ని రోజుల్లో మూవీస్ కి కూడా డేట్స్ ఇవ్వనున్నారు. ఇక బాలయ్య చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే రానున్న రోజుల్లో బాలయ్య కి ఎదురే ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి బాలయ్య చేసే ప్రతి సినిమా కూడా హ్యాట్రిక్ గా నిలుస్తుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్స్ ని కూడా తెచ్చి పెడుతుంది. అందువల్ల ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అనే అంచనాలో అభిమానులు ఉన్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: