కల్కి మూవీతో తన మల్టీప్లెక్స్ ఓపెన్ చేసిన స్టార్ హీరో.. దూసుకుపోవడం ఖాయం అంటున్న నెటిజన్స్..!

lakhmi saranya
టాలీవుడ్ యువర్ నటుడు నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు కొద్దిరోజుల కిందట నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇది తాజాగా నిజమైంది. అగ్ర హీరోలు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ బాటలోనే నితిన్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. కుర్ర హీరో ఏషియన్ సమస్తతో కలిసి ANS మూవీస్ ఏషియన్ నితిన్ సితార అనే మల్టీప్లెక్స్ ప్రారంభించాడు.
ఇక నితిన్ కు ఇంతకముందే సితార థియేటర్ ఉంది. తెలంగాణ సంగారెడ్డి లో ఉన్న ఈ థియేటర్ను ఇనోవేషన్ చేయించి ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ గా మార్చారు. ఇక ఈ థియేటర్కు ఏషియన్ నితిన్ సితార అని పేరు పెట్టారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈరోజు ప్రభాస్ నటించిన కల్కి చిత్రంతో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలకు మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఇంతకు ముందు మహేష్ బాబు అండ్ విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఇటీవల మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. ఇక వీరి బాటలోనే నితిన్ కూడా నడుస్తూ తన మల్టీప్లెక్స్ ని పాన్ ఇండియా సినిమాతో స్టార్ట్ చేశాడు. సరికొత్త హంగులతో ఈ మల్టీప్లెక్స్ ని ప్రారంభించాడు నితిన్. ఇక ప్రభాస్ మూవీ అంటే మినిమం కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. దీంతో ఈ మల్టీప్లెక్స్ కి బాగానే కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలిసింది పలువురు మీ మల్టీప్లెక్స్ దూసుకుపోవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీలో దీపికా పదుకొనే అండ్ దిశాపటాని హీరోయిన్స్ గా నటించగా అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: