కల్కిపై రివ్యూ ఇచ్చిన రేణు దేశాయ్.. వారం రోజులు పని చెయ్యదు అంటూ పోస్ట్..!

lakhmi saranya
ప్రజెంట్ ఎక్కడ చూసినా కల్కి వేరే వినిపిస్తుంది. సినీ ప్రేక్షకులు అండ్ ప్రేక్షకులు అదేవిధంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా సమయం రానే వచ్చింది. థియేటర్లలో మోత మోగిస్తుంది కల్కి. కల్కి మూవీ బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ప్రభాస్ అభిమానులలో సంబరాలు అంబరాన్ని ఉంటాయి. ఇక సెలబ్రిటీలు సైతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ థియేటర్లలో చూసేందుకు ఉత్సాహపడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే రేణు దేశాయ్ కూడా ఈ మూవీ ని చూసి మూవీ పై రివ్యూ ఇచ్చింది.
కల్తీ మూవీ నేడు అనగా జూన్ 27వ తారీకున రిలీజ్ కావడంతో హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఉన్న పి సి ఎక్స్ స్క్రీన్ లో రేణు దేశాయ్ తన కుటుంబంతో కలిసి మూవీకి వెళ్లారు. ఏక ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారంతా కల్కి టీ షర్ట్ ధరించి సందడి చేశారు. ఇక ఇందులో అఖీరా కూడా ఉండడంతో మరింత అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ సందర్భంగా రేణు దేశాయ్ పోస్ట్ షేర్ చేసింది.‌ " చాలా సేపటి తరువాత ఒక సినిమా సమయంలో చాలా బిగ్గరగా అరుస్తూ.. హూట్ చేశాను. కనీసం ఒక వారం పాటు నా గొంతు ఇక పని చేయదు అనుకుంటున్నా. కల్కి మార్నింగ్ షో కోసం వెళ్లాను.
అబ్బాయిలు తప్పకుండా మీ ఫ్యామిలీతో వెళ్లి వెంటనే చూడండి " అంటూ అత్విక్ లో పేర్కొంది రేణు దేశాయ్. ప్రజెంట్ రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక స్వయంగా సినీ సెలబ్రేటివ్ లే థియేటర్ని ఆశ్రయించి సినిమాపై పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో ఈ మూవీని చూసేందుకు సాధారణ ప్రేక్షకులు మరింత ఉషారు చూపిస్తున్నారు. దీనిబట్టి చూసుకుంటా కల్కి సినిమాకి మంచి కలెక్షన్స్ రాబట్టే విధంగానే కనిపిస్తుంది. ఇక సలాం వంటి బ్లాక్ మాస్టర్ మూవీ అనంతరం ప్రభాస్ చేసిన తదుపరి చిత్రం కల్కి. ఈ చిత్రంలో ప్రభాస్ ని జోడిగా దీపికా పదుకొనే అండ్ దిశా పటాని నటించారు. అదేవిధంగా అమితాబచ్చన్ మరియు కమల్హాసన్ వంటి స్టార్స్ కూడా ఇందులో ముఖ్యపాత్రను పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: