ముంబై బీచ్ లో చక్కర్లు కొడుతున్న "కుబేర" టీమ్..!

murali krishna
 కొలీవుడ్ యువ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. డీసెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్ర లో నటిస్తున్నారు. ధనుష్, నాగ్ కాంబో లో ఫస్ట్ మూవీ కావడంతో.. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కుబేరా' మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగార్జున, ధనుష్‌తోపాటు దర్శకుడు శేఖర్ కమ్ముల జుహు బీచ్‌లో చక్కర్లు కొట్టారు.నాగార్జున, ధనుష్‌లను చూసేందుకు స్థానిక ప్రజలు అక్కడ గుడిగూడారు. కొంతమంది అభిమానులు వారితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే, ధనుష్ సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం ఓ అభిమానిని పక్కకు తోసేశారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.ఈ సారి నాగార్జున మాత్రం జాగ్రత్తగా వ్యవహరించారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటన రిపీట్ కాకుండా అప్రమత్తంగా ఉన్నారు. ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టొద్దని తన సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు.అడిగిన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ కూల్‌గా కనిపించారు నాగార్జున. అక్కడ పరిస్థితి గందరగోళంగా మారడం తో షూటింగ్‌ కు విరామం ఇచ్చినట్లు తెలిసింది.
 
'కుబేర' మూవీని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.రష్మిక మందన్న , జిమ్ సర్భ్ ఇతర ప్రముఖ పాత్రల్లో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ సోషల్ డ్రామా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏక కాలం లో జరుగుతున్నాయి.అంతే కాకుండా దాదాపు అంద‌రు న‌టీన‌టులు ఈ షెడ్యూల్లో పాల్గొంటుండ‌డం విశేషం.అటు తెలుగు ఇటు తమిళ్ ఫాన్స్ మూవీ రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: