ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్న మనమే... మొత్తం వచ్చిన కలెక్షన్స్ ఇవే..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి హీరోయిన్గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో మనమే అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూన్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. మరి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని లాభాలు వచ్చాయి అని వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
18 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.85 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 95 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 4.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 18 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.90 కోట్ల షేర్ ... 17.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 18 రోజుల్లో 60 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 18 రోజుల్లో 10.5/65 కోట్ల షేర్ ... 21 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా 18 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని 65 లక్షల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: