వామ్మో అనుష్క కి అలాంటి వ్యాధి ఉందా.. దానివల్ల షూటింగ్లో కూడా ఆ పనులు..!?

Anilkumar
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తాజాగా తను ఒక అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా ఒక బిగ్ షాకింగ్ న్యూస్ రివిల్ చేసింది. తాను చాలా కాలం నుండి అవ్యాధి తో తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిపింది. మరి అనుష్క ఏ వ్యాధితో బాధపడుతోంది ఆ వ్యాధికి సంబంధించిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలు చేసి భారీ గుర్తింపును సంపాదించుకున్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమా కంటే ముందు

 తెలుగు హిందీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బాహుబలి తర్వాత ఫ్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడంతో అనుష్కకి వరుస సినిమాల్లో అవకాశాలు వస్తాయి అనుష్క వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బాహుబలి తరువాత సినిమాలో చేయడం మానేసింది అనుష్క. కేవలం రెండు మూడు సినిమాలు చేసి కామ్

 అయ్యింది. ఇక అనుష్క వ్యాధికి సంబంధించిన విషయానికి వస్తే..అనుష్క సూడోబుల్బార్ ఎఫెక్ట్ అంటే PBA అనే వ్యాధి బారిన పడింది. ఇది అరుదైన నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాది సోకిన వ్యక్తి అదుపు లేకుండా నవ్వడం లేదా ఏడవడం చేస్తాడు. అనుష్క ఏ వ్యాధి బారిన పడిందో స్వయంగా ప్రకటించలేదు.. నవ్వుతూ ఏకంగా కొన్ని నిమిషాల పాటు ఉండిపోతా అని లక్షణాలు మాత్రమే చెప్పిప్పింది. దీనిని బట్టి స్వీటీ కూడా సూడోబుల్బార్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అనుష్క చివరిసారి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం.. ఘటి, కథనార్ అనే ల్లో నటిస్తోంది అనుష్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: