సూపర్ ఫాంలో రయ్ మంటూ జెట్ స్పీడులో దూసుకుపోతున్న రష్మిక?

Purushottham Vinay
 కన్నడ బ్యూటీ రష్మిక మందన్న పుష్ప, యానిమల్‌ సినిమాల తర్వాత పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను చేస్తున్న రష్మిక మందన్న పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెల్సిందే.ఇంకా ఈ సినిమాలే కాకుండా మరో మూడు నాలుగు సినిమాలు కూడా  ఉన్నాయి. మరో రెండు మూడు సినిమాలకు కూడా రష్మిక సైన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చేతిలో అర డజను సినిమాలతో రష్మిక ఇండస్ట్రీలోనే అత్యంత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తమిళ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న కుబేర సినిమాతో పాటు పుష్ప2,  గాళ్ ఫ్రెండ్‌ సినిమాలు ఈ ఏడాది లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


వచ్చే ఏడాదిలో హిందీ సినిమా సికిందర్‌, రెయిన్ బో ఇంకా ఎన్టీఆర్‌ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ లో నటించబోతుంది. అలాగే బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి చావా అనే సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తుంది. యానిమల్‌ సీక్వెల్‌ అయిన యానిమల్‌ పార్క్ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించబోతోంది.అంతేకాదు యానిమల్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ రూపొందించబోతున్న ప్రభాస్‌ స్పిరిట్‌ లో కూడా రష్మిక మందన్న నటించబోతుందని సమాచారం. ఇలా రష్మిక బాలీవుడ్‌, కోలీవుడ్‌ టాలీవుడ్‌ లో బాగా బిజీగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా రష్మిక మందన్న పేరు వినిపిస్తుంది. అలాగే సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్ పీక్స్ లో ఉంది. ఎక్కడ విన్నా కూడా రష్మిక నామ స్మరణ జరుగుతుంది. ఇంతటి క్రేజ్ కేవలం రష్మిక మందన్నకే సాధ్యం అన్నట్లుగా ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పెద్ద పాన్ ఇండియా హీరోయిన్ గా రష్మిక మందన్న ఫుల్ ఫాంలో రయ్ మంటూ చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది. చూడాలి రష్మిక మందన్న ఈ దూకుడుని భవిష్యత్తులో కొనసాగిస్తుందో లేదో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: