షాకింగ్ : మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కల్కి సాంగ్.. కానీ ఇప్పుడు కాదు..!?

Anilkumar
ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమాలో కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ యూనివర్సల్ స్టార్ హీరో కమలహాసన్ పలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే దిశా పటాన్ని హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భార్య అంచనాలు నెలకొన్నాయ్. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు అందరూ ఎంతో ఎక్సైటింగ్  దీని కోసం ఎదురుచూస్తున్నారు .మరోవైపు యుఎస్

 మార్కెట్లో ప్రీమియర్స్ ద్వారా దాదాపుగా 3 మిలియన్ యూఎస్ డాలర్ కలెక్ట్ చేసింది కల్కి. మొత్తానికి మొదటి రోజు నుండి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధిస్తుంది. ఇకపోతే దాదాపుగా 600 కోట్లకు పైగానే బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టికెట్ల రేట్లు పెంపు విషయంలో కూడా ఊహించిన విధంగా సరికొత్త మార్పులు జరుగుతున్నాయి. ఇక ఈ విషయం పక్కనపెడితే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాలో కల్కి అనే ఒక పాట ఉంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక ఆ

 విషయాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. చిరంజీవి నటించిన 'రక్త సింధూరం' సినిమాలో కదిలింది.. కదిలింది కల్కి అవతారం అంటూ ఓ పాట ఉంది. అప్పట్లోనే కల్కి పాత్ర గురించి ఈ పాటలో వివరించారు. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసారు. పోలీస్ ఆఫీసర్ గా, గండ్ర గొడ్డలి పాత్రల్లో చిరంజీవి ఒదిగిపోయారు. ఆ సినిమాలోని ఈ పాటను మెగాభిమానులు ఇపుడు గుర్తు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి మూవీ కూడా సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఏది ఏమైనా ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజే దాదాపు రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: