కల్కి: భైరవ తల్లిగా ఆ స్టార్ హీరోయిన్..!?

Anilkumar
సీతారామం హాయ్ నాన్న వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది మృనాల్ ఠాగూర్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె పూజా మేరీ జాన్ అనే బాలీవుడ్ సినిమాలో చేస్తోంది. అలాగే తెలుగులో ఇంకొన్ని సినిమాలను లైన్లో పెట్టింది. అయితే ఆమె ఓకే చేసిన సినిమాలకి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్

 హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినబడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ప్రమోషన్స్ లో భాగంగా కానీ వీరి ఇతర విషయాల్లో కానీ మృణాల్ ఠాకూర్ ఇందులో నటిస్తోంది అని ఎక్కడ కూడా బయట పెట్టలేదు చిత్ర బృందం. అయితే తాజాగా మృణాల్ కల్కి సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. భైరవ తల్లి పాత్రను ఇందులో మృణాళ్‌ పోషించిందట. భైరవ చిన్నప్పటి సన్నివేశాల్లో మృణాళ్‌ పాత్ర కనిపిస్తుందని

 తెలుస్తున్నది. హీరోయిన్‌గా పీక్స్‌లో ఉండి కూడా ఇలా ప్రభాస్‌కి తల్లిగా నటించడం నిజంగా గ్రేట్‌ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని 'కల్కి' టీమ్‌ అధికారికంగా ప్రకటించలేదు. ప్రచార చిత్రాల్లో కూడా ఎక్కడా మృణాళ్‌ జాడ లేదు. అయితే.. సినిమాలో మాత్రం ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది అయితే కేవలం ఇందులో మృణాల్ ఠాగూర్ మాత్రమే కాదు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి చాలామంది యంగ్ హీరోలు పలు పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వాటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: