నేను ఎప్పుడూ మధ్యలోకి రాను..సప్తమి గౌడ ఎమోషనల్ పోస్ట్..!

lakhmi saranya
కన్నడలో బిగ్గెస్ట్ మూవీ ఫ్యామిలీ అయినా డైరెక్టర్ రాజ్ కపూర్ కుటుంబంలో విడాకుల వార్తలు రావడం ఇదే మొదటిసారి. రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ కుమార్ విడాకులు కోరుతూ ఆశ్రయించడం జరిగింది. విడాకుల నోటీసులలో భార్య శ్రీదేవి పై యువరాజ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఈ నోటీసులకు శ్రీదేవి తన లాయర్ ద్వారా సమాధానం ఇవ్వడం జరిగింది. శ్రీదేవి తన సమాధానం తో యువ రాజ్ కుమార్ అండ్ సప్తమి గౌడ మధ్య ఎఫైర్ను పదేపదే ప్రస్తావించింది.
సప్తమి గౌడ మరియు యువ ప్రేమలో ఉన్నారని ఏడాది కాలంగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని శ్రీదేవి తన ఆరోపణలలో చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈరోజు సప్తమి గౌడ కు చెందిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియోలో సప్తమి గౌడగా చెప్తున్నా యువతి వాయిస్.. నా వైపు కథ వినండి.. నాకు ఒక అవకాశం ఇవ్వండి... నేను తప్పు చేశాను.. అంటూ ఏడుస్తూ వేడుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇది దర్శకుడు లేదా నిర్మాతకి పంపించబడిన ఆడియో అని అంటున్నారు.
ఆమె ఆడియోలో ఉన్నదున్నట్టు మీకోసం. హాయ్ సార్ ఏం జరుగుతుందో మీకు ముందే తెలిసి ఉండాలి. నా వైపు కథ చెప్పే అవకాశం ఇవ్వండి. నేను ఏ తప్పు చేయలేదని చెప్పడం లేదు. కచ్చితంగా నా తప్పు ఉంది. నేను కాదు అనడం లేదు. నేను మా అమ్మాయి పై ప్రమాణం చేస్తున్నాను. బాబా పై ప్రమాణం చేస్తున్నాను మీ భార్యను వదిలేసి నాతో రమ్మని నేనెప్పుడూ గురు కి చెప్పలేదు. కావాలంటే అతన్ని కూడా అడగవచ్చు.. ఇది మీ సెట్ లో జరిగింది. మాపై మీకు ఎంత కోపం వచ్చినా పర్వాలేదు సార్. నేను మాట్లాడానని మా ఇంట్లో కూడా వాగ్దానం చేశాను.. అంటూ ఆడియోలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: