అన్న దండం పెడితే.. తమ్ముడు పిండం పెట్టాడు.. పవన్, చిరు పై కామెంట్స్ చేసిన SKN..!

lakhmi saranya
ప్రజెంట్ ఉన్న సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఒకానొక సమయంలో ప్రొడ్యూసర్లు అంటే ఎవరో కూడా పెద్దగా సినీ ప్రేక్షకులకి తెలిసేది కాదు. కానీ ప్రెసెంట్ జనరేషన్ లో వారు ప్రొడ్యూస్ చేసే సినిమా ప్రమోషన్స్ లో జోరుగా సందడి చేస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటున్నారు. అదేవిధంగా సినిమాలు ప్రొడ్యూస్ చేయడమే కాకుండా పలు ఘటనలపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఇక తాజాగా ఈ తరహా లోనే ఎస్ కేఎన్ కూడా నడిచాడు. బేబీ మూవీ తో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఎస్కేఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక బేబీ మూవీ అనంతరం నుంచి జోరుగా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ తనదైన రీతిలో దూసుకుపోతున్నాడు ఎస్కేయన్. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి పై వ్యాఖ్యలు చేశాడు ఈ ప్రొడ్యూసర్. తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ.." అన్నయ్య పెట్టాడు దండం.. తమ్ముడు పెట్టాడు పిండం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం.
ఆ సంస్కారం చేతకానోళ్లకి ప్రజలే ఇస్తారు ఇటువంటి తిరస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింహాసనం మీద కూర్చునే అర్హత మా అన్నయ్య ఇంద్రసేనుడిది. అలాగే రాజకీయాల్లో సింహాసనాన్ని మార్చేసే బలం మన జన సేనుకుడిది " అంటూ భారీ డైలాగులు చెప్పాడు ఈ ప్రొడ్యూసర్. ఇక ఎస్ కే ఎన్ పరోక్షంగా జగన్ పై వ్యాఖ్యలు చేశాడు. ప్రజెంట్ ఈన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఈన వ్యాఖ్యలను చూసిన వారంతా.. వహ్వా వహ్వా... ఏం డైలాగ్స్... నువ్వు ప్రొడ్యూసర్ వి అయిపోయావు కానీ డైరెక్టర్ వి అయ్యుంటే సినీ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళేది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: