జాక్ పాట్ కొట్టేసిన సామ్! ఏకంగా బాలీవుడ్ దిగ్గజాల సినిమాలో ఛాన్స్?

Purushottham Vinay
జాక్ పాట్ కొట్టేసిన సామ్! ఏకంగా బాలీవుడ్ దిగ్గజాల సినిమాలో ఛాన్స్?  వరుస ప్లాపుల్లో అవకాశాలు లేక సతమతం అవుతున్న సమంత ఇప్పుడు జాక్ పాట్ కొట్టేసింది. ఏకంగా బాలీవుడ్ టాప్ హీరో శారుఖ్ ఖాన్, టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక డంకి సినిమా తర్వాత, షారుఖ్ ఖాన్ మరోసారి రాజ్‌కుమార్ హిరానీతో మళ్లీ సినిమా చేస్తున్నట్లు  నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమా యాక్షన్-అడ్వెంచర్-దేశభక్తి చిత్రం అని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ వార్తలు కనుక నిజమైతే అభిమానులకు ఖచ్చితంగా ట్రీట్‌గా మారడం ఖాయం. తెరపై హ్యూమన్ ఎమోషన్స్‌ని పెంపొందించడంలో పేరుగాంచిన రాజ్ కుమార్ హిరానీ సినిమాలో ఛాన్స్ అంటే సమంతకి మామూలు విషయం కాదు. ఇలా చాలా విరామం తర్వాత  సమంతకు ఓ సువర్ణావకాశం దక్కింది. శారుఖ్ రాజ్ కుమార్ హిరానితో చేసిన డంకి చిత్రం బాక్సాఫీస్ వద్ద  పర్వాలేదనిపించుకుంది. ప్రపంచ బాక్సాఫీస్‌లో 500 కోట్ల వసూళ్ళని సంపాదించింది. ఇది 2023లో షారుఖ్ ఖాన్ కి మూడవ చిత్రం. 


అయితే షారుఖ్‌ ఖాన్ నుంచి సినిమా ఈ ఏడాది విడుదల ఉండకపోవచ్చు. అయన తన రాబోయే చిత్రాలను కూడా ప్రకటించలేదు. అయితే kgf ఫేమ్ నటుడు యష్ తదుపరి చిత్రం 'టాక్సిక్'లో షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో నటించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇంకా అంతేకాకుండా, అతను పఠాన్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ 'కింగ్' సినిమా కూడా పైప్‌లైన్‌లో ఉన్నాడు. ఈ సినిమా ఆయన కూతురు సుహానా ఖాన్ రంగస్థల ప్రవేశాన్ని కూడా సూచిస్తుంది. ఇక మరోవైపు సమంతా రూత్ ప్రభు విషయానికి వస్తే ఆమె చివరిసారిగా 2023 వ సంవత్సరంలో విజయ్ దేవరకొండతో కలిసి కుషి చిత్రంలో కనిపించారు. ఈమె మైయోసిటిస్ బారిన పడ్డ తర్వాత గత సంవత్సరం నటన నుండి సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఆమె తదుపరి ప్రాజెక్ట్ సిటాడెల్.  ఇందులో సమంత యంగ్ వరుణ్ ధావన్ సరసన నటించనుంది. ఈ సిరీస్‌ను ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, రాజ్, డికె  నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: