హల్ చల్ చేస్తున్న తారక్ చిన్నప్పటి వీడియో.. ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి..!

lakhmi saranya
నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి పపరిచమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఊహించని స్థాయిలో మాస్ ఇమేజ్ అందుకుని ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. తన నటనతో అండ్ డ్యాన్స్ తో ఎన్టీఆర్ ఎంతగానో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యాక్టర్ గా అండ్ డాన్సర్ గా మరియు సింగర్ గా మల్టీ టాలెంటెడ్ అయిపోయాడు తారక్.
పేజీలకు పేజీలు డైలాగ్స్ కూడా సింగల్ టేక్ లో చెప్పగల సామర్థ్యం కలిగిన వాడు తారక్. ఇక ఇటీవల  త్రిబుల్ ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు తారక్. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర అనే సినిమా చేయబోతున్నాడు. దేవర మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి అండ్ కొడుకు గా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 27వ తారీకున గ్రాండ్గా రిలీజ్ కానుంది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ చిన్ననాటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ చిన్నప్పుడు యూరోపియాన్ తెలుగు అసోసియేషన్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో సీనియర్ ఎన్టీఆర్ శారదా పక్కన ఎన్టీఆర్ కూర్చుని మాట్లాడుతున్న వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. ప్రెసెంట్ ఈ వీడియో చూసిన వారంతా.. ఇంత క్యూట్ గా ఉన్నావు ఏంటి ఎన్టీఆర్. నిన్ను చూస్తుంటే మగవారికి కూడా అసూయ కలుగుతుంది. అంత బాగున్నావు మరి. ఏదేమైనా అందంలో నీకు నువ్వే సాటి... అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: