3వ వారంలో కూడా మహారాజా ను తట్టుకొని నిలబడుతున్న మనమే... ఇప్పటివరకు ఎంత వచ్చిందంటే..?

Pulgam Srinivas
శర్వానంద్ తాజాగా మనమే అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ జూన్ 7వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు పరవాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. ఆ తర్వాత ఈ మూవీకి కలెక్షన్లు స్టడీగా మొదటి వారం రోజులు వచ్చిన నెక్స్ట్ వారం సినిమాలతో పోటీ పడే హిట్ సాధించడం కష్టమే అని అంతా అనుకున్నారు. రెండవ వారంలో హరోం హర , మహారాజా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కి గట్టి పోటీ ఇస్తాయి అని జనాలు అనుకున్నారు. కానీ హరోం హర సినిమా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ మనమే కి పెద్దగా పోటీ ఏమీ కాలేదు. కానీ మహారాజా మూవీ నుండి ఈ సినిమాకు పెద్ద స్థాయిలో పోటీ ఉన్నా కానీ మనమే తట్టుకొని నిలబడి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమా హిట్ ను స్టేటస్ను అందుకుంది. ఇప్పటివరకు మనమే సినిమాకు సంబంధించిన 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 16 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.
16 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.72 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 91 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 3.92 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 16 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.55 కోట్ల షేర్ ... 16.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 16 రోజుల్లో 60 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.14 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 16 రోజుల్లో 10.29 కోట్ల షేర్ ... 20.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా 16 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని 29 లక్షల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: