బాలయ్య 109వ మూవీలో కన్నడ నటుడు.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

lakhmi saranya
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో NBK 109 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ అండ్ ఫార్చున్ ఫోర్ సినిమా బ్యానర్స్ పై నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో చాందిని చౌదరి, మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది.

దీంతో మేకర్స్ పోస్టర్స్ అండ్ గ్లిమ్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మరో స్టార్ నటుడి పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. కన్నడ స్టార్ రిషి ఇందులో విలన్ గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ తన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే నేడు రిషి పుట్టిన రోజు కావడంతో ఫాన్స్ సర్ప్రైజ్  చేస్తూ అతని లుక్ రివీల్ చేశారు. ఇక ప్రస్తుతం రిషి పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇక ఈ చిత్రం దసరా కానుకగా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న బాలకృష్ణ త్వరలోనే సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ పెట్టనున్నారు. ఇక ఇటీవల బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఇక ఈ సందర్భం లో బాలయ్య సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదల అవ్వడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విలన్ పాత్రకి రిషి అదుర్స్. మరోసారి బాలయ్య ఖాతాలో పక్కా సూపర్ హిట్ పడుతుంది. మాకు నమ్మకం ఉంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: