వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిన "మహారాజ"... ఇప్పటికే అన్ని లాభాలు..?

Pulgam Srinivas
తమిళ నటుడు విజయ్ సేతుపతి తాజాగా మహారాజా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మమతా మోహన్ దాస్ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా జూన్ 14 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. దానితో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ 7 రోజుల్లో ఈ సినిమాకి నైజాం ఏరియాలో 1.84 కోట్లు కలెక్షన్లు దక్కగా, సీడెడ్ లో 68 లక్షలు , ఆంధ్ర లో 1.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 7 రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 4.07 కోట్ల షేర్ , 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 57 లక్షల లాభాలను అందుకుంది. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన హోల్డ్ ను కనబరుస్తుంది. దానితో ఈ సినిమా మరికొన్ని రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లను చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: