కల్కి ఈవెంట్ లో హైలెట్ గా దీపిక.. ఆమె పెట్టుకున్న ఆ వజ్రాల బ్రేస్ లెట్ ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది..!?

Anilkumar
మరో ఆరు రోజుల్లో కల్కి సినిమా ఎంతో గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కేవలం ఆరు రోజుల వ్యవధిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను శరవేగంగా చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ముంబైలో బుధవారం దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్ అమితాబచ్చన్ కమలహాసన్ తో పాటు దీపికా పదుకొనే సైతం వచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో దీపికా

 పదుకొనే చాలా హైలెట్ అయ్యారు అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో దీపికా పదుకొనే తన బేబీ బంప్ తో కనిపించింది. అలా దీపికా పదుకొనే ను చూడడంతో ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తను స్టేజ్ పైన వస్తున్నప్పుడు తన బేబీ బంప్ పై చేయి వేసుకొని వచ్చారు. ఆ తరువాత ప్రభాస్ స్వయంగా తనను స్టేజ్ పై నుండి కిందికి తీసుకువచ్చి జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టారు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఇక   దాదాపు అందరూ బ్లాక్‌ కలర్‌

 డ్రెస్‌లోనే మెరిశారు. దీపికా సైతం టైట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించింది. సింపుల్‌గా ఉండేందుకే మొగ్గు చూపిన ఈ బ్యూటీ తన ఎడమ చేతికి వజ్రాల బ్రేస్‌లెట్‌ ధరించింది. దీని ధర 1 కోటి 16 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఈ ఆభరణం తన లుక్‌కే మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఇకపోతే కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, బిగ్‌బీ, దీపికా పదుకొణె, కమల్‌ హాసన్‌, దిశా పటానీ, శోభన, పశుపతి సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం కల్కితో ఎటువంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: