మెల్లిగా ఎక్కేస్తున్న దేవర.. మారుతున్న టాక్?

praveen
కొరటాల శివ దర్శకత్వంలో, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర నిన్న ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిన్న బెనిఫిట్ షోస్ చూసినవారు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కేరింతలు కొట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే దాదాపుగా బెనిఫిట్ షోలు అనేవి తారక్ అభిమానులే చూస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా బాగుందని చెబుతారు. అయితే మార్నింగ్ షో, మ్యాట్నీ షో చూసిన సగటు ప్రేక్షకులు మాత్రం సినిమా యావరేజ్ అంటూ పెదవి విరిచేశారు. దాంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... దేవర సినిమా స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారా? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయం ఏమిటంటే, సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ అదిరిపోయింది అంటూ రెస్పాన్స్ ఇవ్వడమే దీనికి కారణం.
ఇకపోతే, టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. అందాల తార శ్రీదేవి కూతురు ఎన్టీఆర్ సరసన నటించింది. ఇక బాలీవుడ్ యాక్షన్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ దేవర సినిమాలో ప్రతి నాయకుడు పాత్రను విజయవంతంగా పోషించారు. ఇక ఈ సినిమాకి ప్రధాన హైలెట్ జూనియర్ అనే తెలుస్తోంది. నటనపరంగా హీరోయిన్ జాన్వీకి అంత స్కోప్ లేనప్పటికీ గ్లామర్ బాగా పండించిందని టాక్. ఇక ప్రతి నాయకుడి పాత్రను చేసిన సైఫ్ అలీ ఖాన్ దుమ్ము దులిపేశాడని, ప్రేక్షకుల చేత థియేటర్లలో విజిల్స్ ఏపించాడని సమాచారం. ఇక మీరు సినిమాని చూసినట్లయితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నటనపరంగా ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారో కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: