పుష్ప 2 పోస్ట్ పోన్.. ఎట్టకేలకు బయటపడ్డ అసలు నిజం..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వల్ గా ఇప్పుడు పుష్ప 2 ప్లాన్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తోంది .రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే పాటలు టీజర్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద

 ఎత్తున రెస్పాన్స్ అందుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. ఆగస్టు నుండి డిసెంబర్ 6 కు వాయిదా వేశారు చిత్ర బృందం. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆసనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్లనే ఈ సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ చెబుతుండగా అస్సలు కారణం వేరే ఉందని సమాచారం.ఈ సినిమా లో విలన్ గా

 నటిస్తున్న ఫహద్ ఫాసిల్ ఈ సినిమా షూటింగ్ కోసం జనవరిలోనే ఎక్కువ డేట్స్ ఇచ్చారట.కానీ దర్శకుడు సుకుమార్ ఫహాద్ కు సంబందించిన సీన్స్ చివరిలో తీసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.దీనితో ఫహాద్ డేట్స్ వేస్ట్ అయినట్లు సమాచారం.అయితే మళ్ళీ సరైన సమయంలో ఫహాద్ డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం ఫహాద్ పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది. మొత్తానికి పుష్పటు విడుదల వాయిదా కావడానికి అసలు కారణాలు బయటపడడంతో కాస్త శాంతించారు బన్నీ ఫాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: