బొక్క పెట్టేసిన పహాద్ ఫాజీల్.. పుష్ప-2 కి బిగ్ షాక్?

praveen
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న పుష్ప 2 మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని వర్గాల  క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. అనుకున్నట్టుగానే ఈ మూవీ విడుదలవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

 ఎందుకంటే ఈ సినిమాకు ఏదో ఒక అడ్డంకు ఏర్పడుతూనే ఉంది. ఏకంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ విషయంలో సుకుమార్ సంతృప్తిగా లేడని.. వాటిని మళ్లీ రీ షూట్  చేయడానికి రెడీ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. దీంతో ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల వాయిదా పడి చివరికి డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. అదే సమయంలో ఈ మధ్యకాలంలో పుష్ప 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా తరచూ వాయిదా పడుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనె ఈ సినిమాలోని మిగతా నటుల షెడ్యూల్స్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఈ విషయంలోనే విసిగిపోయిన ఫహద్ ఫాసిల్ అటు పుష్ప 2 చిత్ర బృందానికి ఒక కండిషన్ పెట్టాడట. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరగకపోవడం కారణంగా మిగతా సినిమాలో షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని మరి అతను హైదరాబాద్ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకవేళ ముందే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కాకుండా షూటింగ్ క్యాన్సల్ అయితే ఆయన రెమనరేషన్ డబుల్ చార్జ్ చేస్తానని చెప్పాడట. ఈ క్రమంలోనే ఒక్కో కాల్ షీట్ కు 15 లక్షలకు పైగానే చార్జి చేస్తున్నారట. ఒకవేళ షూటింగ్ ఉంది అని ఎర్లీ మార్నింగ్ క్యాన్సల్ చేస్తే డబుల్ రెమ్యూనరేషన్ ఇవ్వాలని కండిషన్ పెట్టాడట. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ పుష్ప 2 మేకర్స్ కి ఫహద్ ఫాజిల్ పెద్దబొక్కే పెట్టాడుగా అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: