రమ్యకృష్ణ 30ఏళ్ల సినీ ప్రయాణం..ఔరా..!!

murali krishna
రమ్యకృష్ణ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచేయం అవసరంలేని పేరు. ఇప్పుడున్న సినీ ప్రియులకు ఆమె ఓ శివగామి. కానీ 90's అడియన్స్ కు కంటిచూపుతోనే భయపెట్టే ఓ నీలాంబరి.నిజమే మరీ.. అందమే కాదు.. కళ్లతోనూ అద్భుతంగా నటించే హీరోయిన్. ఎలాంటి పాత్రకైనా తనదైన నటనతో ప్రాణం పోసే నటి. ఎన్నో లు.. మరెన్నో పాత్రలు ఆమెను తెలుగు వారికి దగ్గర చేశాయి. 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించిన రమ్యకృష్ణ.. 1990 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో అనేక ల్లో నటించి మెప్పించింది. చిన్న వయసులోనే నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎనిమిదో తరగతి చదువుతూనే వెల్లై మనసులో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత బాల మిత్రులు తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.హీరోయిన్ గానే కాకుండా విలన్ క్యారెక్టర్స్ కూడా అదరగొట్టింది. రజినీకాంత్, సౌందర్య జంటగా నటించిన నరసింహ లో నీలాంబరి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చాలాకాలం పాటు కథానాయికగా నటించిన రమ్యకృష్ణ యంగ్ హీరోల ల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం తల్లిగా నటిస్తుంది.

 దాదాపు 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతుంది రమ్యకృష్ణ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి లో శివగామి పాత్రలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే.. నివేదికల ప్రకారం రమ్యకృష్ణ నికర విలువ రూ.90 కోట్లు. అలాగే ఇప్పుడున్న నటీమణులలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి కూడా ఆమె. ఒక్కో కు రూ.3 నుంచి రూ. 4 కోట్ల వరకు తీసుకుంటారు. అలాగే ఎండార్స్‌మెంట్‌లు, వాణిజ్య ప్రకటన కోసం భారీ మొత్తంలో వసూలు చేస్తారని సమాచరం. ల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై సందడి చేసింది. రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.రజనీకాంత్ తో దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఈమె మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలియజేశారు. 1999వ సంవత్సరంలో రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఈమె నరసింహ సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: