హిందుత్వాన్ని కించపరుస్తూ పాకిస్తాన్లా మారిన బాలీవుడ్?

Purushottham Vinay
అందితే మెడ అందుకుంటే కాళ్ళు పట్టుకోవడం బాలీవుడ్ కి కొత్తేమి కాదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత మూడేళ్లు బాలీవుడ్ కుదేలైపోయింది. దాదాపు బాలీవుడ్ పతనం ఖరారైనా టైంలో మన సౌత్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు చేసి బాలీవుడ్ ని కాపాడారు. మళ్ళీ బాలీవుడ్ సిగ్గులేకుండా పాత పంధాకి వచ్చేసింది.ప్రస్తుతం ప్రపంచంలోనే వరస్ట్ సినిమా ఇండస్ట్రీగా ఘనత సాధిస్తుంది బాలీవుడ్. హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ ని మరో పాకిస్తాన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో విషయం పూర్తిగా అర్ధమై ఉంటుంది. బాలీవుడ్ కి వివాదాలేమి కొత్త కాదు. ముఖ్యంగా హిందూ, సనాతన ధర్మాల విషయంలో ఎన్నోసార్లు బాలీవుడ్ విమర్శలకు గురైంది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అందుకు కారణం.. సీనియర్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్. అమీర్‌ఖాన్‌, రీనాదత్తా ల  తనయుడు జునైద్ ఖాన్ గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పీకే సినిమాతో పాటు తండ్రి అమీర్ ఖాన్ నటించిన పలు బాలీవుడ్ సినిమాలకు జునైద్‌ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.


ఆ తరువాత మహారాజ్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మూవీ రిలీజ్‌కు ముందే మరో రెండు సినిమాల్లో అతడు హీరోగా నటించబోతున్నాడు. కానీ అతని మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే వివాదాల్లో ఇరుక్కుంది. జునైద్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ పి మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహారాజ్. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎన్నో వివాదాలను తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమాలో  హిందు మతాన్ని, ఆచారాలు, సంస్కృతలను మహారాజ్ మూవీతో వక్రీకరించే ప్రయత్నం చేసినట్లు చూపించారు. హిందూ సాధువులను, సన్యాసులను కామంధులుగా చిత్రీకరిస్తూ వారిని మహారాజ్ మూవీతో అవమానించాలని చూస్తున్నట్లు నెటిజన్స్ తిడుతున్నారు. అందుకే ఈ సినిమాను అడ్డుకోవాలని హిందూ పెద్దలు కోర్టును కూడా ఆశ్రయించారు.నిన్న ఉదయం కోర్టు ఈ మూవీని జూన్ 18 కి వాయిదా వేసింది. ఈలోపు విచారణని చేపట్టాలని కోరింది. ఇక అంతేకాకుండా ఇంకోపక్క నెట్ ఫ్లిక్స్ మీద కూడా నెటిజన్స్ తెగ ఫైర్ అవుతున్నారు. ఛీఛీ.. నెట్ ఫ్లిక్స్ కూడా బాలీవుడ్ లాగే ఇక మారదు అని, నెట్ ఫ్లిక్స్ ను బాలీవుడ్ ను బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: