"రాబిన్ హుడ్" మూవీ గ్లిమ్స్ లో ఒక్క డైలాగ్ తో ఆకట్టుకున్న శ్రీలీలా..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా , జీవి ప్రకాష్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని శ్రీ లీల కు సంబంధించిన ఓ చిన్న గ్లిమ్స్ వీడియోతో పాటు ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
 

ఈ మూవీ గ్లిమ్స్ వీడియో చాలా తక్కువ నిడివితో ఉన్నప్పటికీ ఇందులో శ్రీ లీల , వెన్నెల కిషోర్ కాంబోలో ఒక డైలాగ్ ను ఆడ్ చేశారు. మేకర్స్ తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోలో శ్రీ లీల ఫ్లైట్ నుండి దిగి వస్తూ ఉంటుంది.  ఆ సమయంలో ఆమె వెన్నెల కిషోర్ ను జ్యోతి ... సునామీలో టి సైలెంట్ గా ఉండాలి ... నా ముందు నువ్వు సైలెంట్ గా ఉండాలి అని అంటుంది. ఈ చిన్న డైలాగ్ అదిరిపోయే రైమింగ్ తో ఉండడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఈ డైలాగ్ ద్వారా వెన్నెల కిషోర్ ఈ సినిమాలో జ్యోతి అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో భాగంగా శ్రీ లీలా ఈ సినిమాలో మీరా వాసుదేవ్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. గతంలో నితిన్ , వెంకి కుడుముల కాంబోలో భీష్మ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. దానితో విరి కాంబోలో రూపొందుతున్న రెండవ సినిమా అయినటువంటి రాబిన్ హుడ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన ను అనుకున్నారు. కానీ ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ నుండి తప్పుకుంది. ఆ స్థానంలో మేకర్స్ శ్రీ లీలను తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: