నితిన్ తో జతకట్టనున్న నిత్యామీనన్... కానీ చిన్న ట్విస్ట్..!
ఈ క్రమంలోనే ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలు చేస్తుంది. ఇవి తెలుగులో కూడా విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ తెలుగులో మూవీకి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందుతున్న తమ్ముడు చిత్రంలో అతిధి పాత్రకు ఓకే చెప్పిందట నిత్యామీనన్. ఇందులో సప్తమీ గౌడ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ లయతో పాటు నిత్యామీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్. కాగా నితిన్‌తో నిత్యమీనన్ ఇష్క్ అండ్ గుండెజారి గల్లంతయిందే చిత్రాల్లో నటించింది.
ఇక వీరిద్దరి కాంబినేషన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అటువంటి నిత్యామీనన్ ఇప్పుడు నితిన్ సినిమాలో ఓ కీలక పాత్ర అంటే తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. మరి ఫాన్స్ ఆవేదన చూసి అయిన నిత్యామీనన్ ని ఈ సినిమాలో హీరోయిన్గా పెడతారో లేదో చూడాలి. నిత్యా మీనన్ అండ్ నితిన్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఇప్పటివరకు సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కూడా కురిపించాయి. ఇక వీరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే బాగుండు అని చాలా రోజుల నుంచి తమ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.