అల్లు అర్జున్ సినిమాలో ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్లనే మించిపోయింది..!

Anilkumar
ఒకప్పటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన చాలామంది ఇప్పుడు హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు స్టార్ హీరో హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. మరికొందరు మాత్రం అక్కడే ఆగిపోయారు. కానీ కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు మాత్రం చేసిన ఒకటి రెండు సినిమాల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇదిలా ఉంటే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన  కావ్య కళ్యాణ్ రామ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. గంగోత్రి సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో కనిపించిన ఈమె ఇప్పుడు వరుస

 సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గంగోత్రి సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించి సినిమాలకి గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్లనే మించిపోయింది. అలా ఇప్పుడు మరొక చిన్నారి కూడా స్టార్ హీరోయిన్లను మించిపోయే అందంతో కనిపిస్తోంది. ఆ చిన్నారి మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా అప్పటిలో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ అన్న కూతురు పాత్రలో

 కనిపించిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చాలా ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ చిన్నారికి డైలాగ్స్ పెద్దగా లేనప్పటికీ తన క్యూట్నెస్తో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ చిన్నారికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిన్నారి పేరు వర్ణిక. ప్రస్తుతం తనకి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సాంగ్ కు రీల్ చేసింది ఈ చిన్నది. పుష్ప 2 లోని సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి సాంగ్ కు వీడియో చేసింది వర్ణిక. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అప్పటికీ ఇప్పటికి ఎంత మారిపోయింది ఈ చిన్నది అంటూ అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: