SSMB29: లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన రైటర్?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మరో 250 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ మూవీ కోసం తన క్యారెక్టర్ కి తగ్గట్టు లుక్ ను చేంజ్ చేసే పని లో వున్నాడు. ఇప్పటికే లాంగ్ హెయిర్ ,గుబురు గడ్డంతో చాలా స్టైలిష్ గా కనిపించిన పిక్స్ సోషల్ మీడియాని తెగ షేక్ చేసి బాగా వైరల్ అయ్యాయి.మహేష్ కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ కావడం వల్ల ఈ సినిమా కోసం కొంచెం బరువు పెరిగే ప్రయత్నం చేస్తున్నారట. దానికోసం సూపర్ డైట్, జిమ్ చేస్తున్నారు.ఈ మూవీని రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు..అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.


అయితే సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు.కానీ ఆ రోజు ఎలాంటి అనౌన్స్మెంట్ అనేది రాలేదు.దీనితో ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో రాజమౌళి తండ్రి ఇంకా ఈ సినిమా కథా రచయిత అయిన విజయేంద్రప్రసాద్ తెలిపారు.ప్రస్తుతం రాజమౌళి ఈ మూవీకి సంబంధించి సెట్ వర్క్ చేయిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.సెట్ వర్క్స్ మొత్తం పూర్తి అయిన తరువాత ఈ మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు.అలాగే ఈ సినిమా అఫీసియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తరువాతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని ఆయన తెలిపారు .ఇదంతా జరగడానికి మరో రెండు నెలల సమయం పెట్టొచ్చని ఆయన తెలిపారు. ఈ మూవీ పై అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: