కల్కి 2898 ఏడి: తెలుగోడు గర్వించేలా అంచనాలు పెంచేసిన దర్శకుడు?

Purushottham Vinay
హాలీవుడ్ టాప్ మూవీస్ మార్వెల్, డీసి, అవతార్ లకి ధీటుగా నాగ్ అశ్విన్ కల్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సూపర్ హీరో కథలు అంటే ఇప్పటి దాకా హాలీవుడ్ సినిమాలనే అందరూ చెప్పుకుంటున్నారు. కానీ వాటిలో యాక్షన్, గ్రాఫిక్స్ తప్ప ఏమి ఉండదు. కానీ ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులని థియేటర్ల వైపు తిప్పే సత్తా హాలీవుడ్ మార్కెట్ కి ఉంది. అందుకే కొన్ని వేళ కోట్లు వసూళ్లు చేస్తాయి హాలీవుడ్ సినిమాలు. కానీ మన భారతదేశం చరిత్ర చాలా గొప్పది. మన భూమి మీద ఎన్నో గొప్ప గొప్ప కథలు జరిగాయి. కానీ వాటిని పురాణాలు అనుకుంటాం. కానీ అవి నిజమైన కథలు. మన చరిత్ర. మహా భారతం, రామాయణం లాంటి అద్భుతమైన నిజమైన కథలు మనకి ఉన్నాయి. వాటిని ప్రపంచానికి చూపిస్తే మన భారతదేశ చరిత్ర ఏంటో తెలిసిపోతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా కల్కి సినిమా తీస్తున్నాడు నాగ్ అశ్విన్. విష్ణు మూర్తి 10 వ అవతారం కల్కి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.తాజాగా కల్కి 2898 ఏడీ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.


 కచ్చితంగా ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా ఉంటుంని తెలుస్తుంది. ఈ జూన్ 27న కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వస్తోంది.ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రలలో నటించారు. దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ హీరోయిన్స్ కనిపించబోతున్నారు. ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా కల్కి 2898 ఏడీ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ యూనిట్ గట్టిగా చేస్తోంది. వీలైనంత స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి ఈ సినిమాని పంపించే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్ స్టా స్టోరీలో కల్కి 2898 ఏడీ మూవీ గురించి ఇంటరెస్టింగ్ స్టోరీ షేర్ చేశారు. మనం ఇప్పటి దాకా మార్వెల్, డీసీ చిత్రాలు ప్రమోట్ చేసాం. ఇక ఇప్పుడు మన కల్కి 2898ఏడీ మూవీని ప్రమోట్ చేద్దాం. బాహుబలి సినిమాతో ప్రభాస్  ఇండియన్ సినిమాని తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలిపారు. ఇప్పుడు ప్రభాస్, నాగ్ అశ్విన్ లు తెలుగు సినిమా అంటే ఏంటో చూపేందుకు కల్కి తో సిద్ధం అవుతున్నారని స్టోరీ పెట్టాడు.ప్రస్తుతం ఈ స్టోరీ సినిమాపై అంచనాలని మరింత పెంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: