Akhil: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అఖిల్.. అరేయ్ ఏంట్రా ఇది..!

lakhmi saranya
Akhil: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంతో సూపర్ హిట్ కొట్టి అనంతరం ఏజెంట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అఖిల్ తన కెరీర్ లో మరో ఘోరమైన డిజాస్టర్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ చిత్రం రిజల్ట్ ఎంత దారుణంగా వచ్చిందంటే ఇప్పటివరకు ఆయన మరో సినిమాని అనౌన్స్ కూడా చేయాలని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి అఖిల్ యోగి క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ అనే కొత్త దర్శకుడు తో ఓ సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ మూవీ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో ఇంకా క్లారిటీ లేదు. ఇక తాజాగా ఎయిర్పోర్టులో దర్శనమిచ్చాడు అఖిల్. ఒక రకంగా అఖిల్ లుక్ అందరిని షాక్ కి గురిచేసింది. పూర్తి స్థాయిలో జుట్టు పెంచేసి గెడ్డం పెంచేసి ఒక యోధుడు లాగా మారిపోయాడు. అయితే యు వి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించబోయే మూవీ ఏ జోనర్ అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ అఖిల్ లుక్ చూస్తుంటే ఏదైనా ప్రియాదిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి యోవీ క్రియేషన్స్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే రావలసి ఉంది.
కానీ ఎందుకో సినిమా యూనిట్ ఈ విషయాన్ని కూడా వాయిదా వేస్తూ వస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టాక అధికారికంగా ప్రకటిస్తారేమో వేచి చూడాలి. గత కొంతకాలం నుంచి ఎటువంటి సినిమా చేయని అఖిల్ తాజాగా సలార్ మూవీలో నటించబోతున్నాడు అనే రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కారణం సలార్ మూవీ సక్సెస్ మీట్ లో అఖిల్ పాల్గొవడమే. మరి సలార్ మూవీ అనంతరం మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ మూవీ చేస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతానికి అయితే అఖిల్ రీసెంట్ లుక్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: