చాందిని చౌదరి: సూపర్ రికార్డ్ కొట్టిన తెలుగు హీరోయిన్?

Purushottham Vinay
ఒకానొక టైంలో స్టార్‌ హీరోలు రెండు మూడు నెలలకు ఒక సినిమా చొప్పున, నెలకు రెండు సినిమాల చొప్పున విడుదల చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకే హీరోయిన్ నటించిన రెండు మూడు సినిమాలు ఒకే వారంలో విడుదల అయిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి.కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి అలా కనిపించడం లేదు. ఒక్కో హీరోయిన్‌ ఒక్కో సినిమా ఆఫర్‌ దక్కించుకోవడానికే చాలా టైమ్‌ వెయిట్‌ చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఒకే సారి రెండు మూడు సినిమాలు చేస్తున్నా కానీ ఒకే సారి ఆ సినిమాలు వచ్చే పరిస్థితి రావడం లేదు. కానీ తెలుగు అమ్మాయి తెలుగు హీరోయిన్ చాందిని చౌదరికి మాత్రం అరుదైన ఘనత దక్కబోతుంది. అప్పట్లో సాధ్యం అయిన ఘనత ఇప్పుడు చాందిని చౌదరి సొంతం అయ్యింది. రేపు అంటే జూన్ 14న చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన సినిమాలు మ్యూజిక్ షాప్‌ మూర్తి, యేవం విడుదల అవ్వబోతున్నాయి.


ఒకే రోజు రెండు సినిమాలో చాందిని రాబోతుండటం కచ్చితంగా అరుదైన రికార్డ్‌ అనే చెప్పాలి. ఈ రికార్డ్ వేరే హీరోయిన్ కొట్టిన పెద్ద విశేషం కాదు.కానీ ఈ రికార్డ్ తెలుగమ్మాయయిన చాందిని చౌదరి కొట్టడం విశేషం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌ లో హీరోయిన్ గా అవకాశాలు రావడమే గగనంగా మారింది. అలాంటిది ముద్దుగుమ్మ చాందిని చౌదరి ఒకే సారి రెండు సినిమాలు చేయడం, ఆ రెండు సినిమాలు కూడా ఒకే రోజు విడుదలకు రాబోతుండటం కలిసి వచ్చే అంశం అన్నట్లుగా మీడియా వర్గాల వారి నుంచి కామెంట్స్ వస్తున్నాయి. గామి సినిమాతో ఇటీవల ఓ మోస్తారు హిట్ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ చాందిని చౌదరి త్వరలోనే మరో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కలర్‌ ఫోటో సినిమాతో హీరోయిన్ గా మెప్పించాక వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలకు ఈ ముద్దు గుమ్మ మోస్ట్‌ వాంటెడ్‌ అన్నట్లుగా మారింది. అందుకే ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యే స్థాయిలో ప్రస్తుతం అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: