దేవర వాయిదాతో ఆ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న రజిని?

Purushottham Vinay
దేవర వాయిదా విషయంలో తారక్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు.ఇక అక్టోబర్‌లో అయినా రిలీజ్ అవుతుందా అంటే అది కూడా లేదని తెలియడం వల్ల నిరాశలో ఉన్నారు అభిమానులు.జూనియర్ ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా హిట్ కోసం ఎంతో నమ్మకంగా చేస్తున్న దేవర సినిమా షూటింగ్ మాత్రం ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. గోవాలో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు కొరటాల శివ. జులై నెలలోపే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగానే జరుగుతున్నాయి.  అయితే వాయిదా పడటం అంటే వెనక్కి కాదు.. అనుకున్న రిలీజ్ డేట్ కంటే ముందుగానే ఈ సినిమా వస్తుందని సమాచారం తెలుస్తుంది. చెప్పిన తేదీ కంటే ఒక 2 వారాలు ముందే దేవర సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అంటే సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు రావాల్సిన పవన్ కళ్యాణ్ ఓజి కూడా రావట్లేదు కాబట్టి..దేవర సినిమాని రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారు మేకర్స్.పవన్ కళ్యాణ్ ఓజి సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది.

ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చి డేట్స్ ఇచ్చి.. ఆ మూవీని వేగంగా పూర్తి చేసినా కూడా ఓటిటి సంస్థల దగ్గర స్లాట్స్ ఖాళీగా లేవు కాబట్టి 2025లోనే ఓజి విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం నిర్మాతలకు తెలిసే రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు పవన్ ఖాళీ చేసిన సెప్టెంబర్ 27పై జూనియర్ ఫోకస్ చేస్తున్నారు.దేవర సినిమా పూర్తయ్యే దాకా వార్ 2 సినిమా వైపు వెళ్లకూడదని ఫిక్సయ్యారు తారక్. ఆగస్ట్‌ నెల లోపే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుంది కాబట్టి.. అక్టోబర్ 10 దాకా వేచి చూడాల్సిన పనిలేదు. అందుకే రెండు వారాలు ముందే తీసుకొస్తున్నారు దేవర సినిమాని. మరోవైపు దేవర సినిమా ఖాళీ చేసిన డేట్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టైయాన్ సినిమా రాబోతుందని సమాచారం తెలుస్తుంది.అక్టోబర్ 11 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. జై భీంతో సూపర్ హిట్ కొట్టిన జ్ఞానవెల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అందువల్ల ఈ సినిమా పై సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: