రీ ఎంట్రీ కి సిద్ధమవుతున్న "మహాత్మా" మూవీ హీరోయిన్..!!

murali krishna
భావన ఈ అమ్మడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ మహాత్మ సినిమాలో నీలాపురి గాజుల ఓ నీలవేణి అనే సాంగ్ వింటే టక్కున గుర్తొస్తుంది ఈ చిన్నది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితమా అయ్యారు. అందం , అభినయం ఉన్న ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలు మాత్రేమే చేసి ఆతర్వాత బిజినెస్ లోకి లేదా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉండటం లాంటివి చేస్తున్నారు. అలా సినిమాలకు దూరంగా ఉంటున్న ముద్దుగుమ్మల్లో భావన ఒకరు.
సినీ రంగుల ప్రపంచంలో గుర్తింపు రావడం చాలా కష్టం. ఎన్నో కష్టాలు.. అడ్డంకులను దాటుకుని ఒక ఫేమ్ తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ ఇక్కడ అందం, టాలెంట్ మాత్రమే కాదు..కాసింత అదృష్టాన్ని కూడా వెంట తెచ్చుకోవాల్సిందే.స్టార్ హీరోస్ విషయం పక్కన పెడితే హీరోయిన్స్ విషయంలో లక్ కచ్చితంగా ఉండాల్సిందే. ఒక్క తోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నా.. ఆ తర్వాత ఊహించని కారణాలతో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న తారలు ఆ తర్వాత మాత్రం కంటికి కనిపించారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం ఒకే ఒక్క తో క్లిక్ అయ్యింది. అందం, అభినయంతో ఒకప్పుడు తెలుగు కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస లతో బిజీగా ఉంటుందనుకున్న హీరోయిన్ జీవితం ఊహించని మలుపులు తిప్పింది. కిడ్నాప్, లైంగిక దాడి ఆమె కెరీర్‏ను నాశనం చేశాయి. జీవితంలో జరిగిన చేదు ఘటనల తర్వాత కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? తను మరెవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ భావన.
మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన భావన.. తెలుగులో ఒంటరి, మహాత్మ, జగడం, పగ, హీరో వంటి చిత్రాల్లో నటించింది. టాలెంటెడ్ హీరో శ్రీకాంత్ సరసన నటించిన మహాత్మ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో భావనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో ఈ బ్యూటీ సహజ నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు అంతగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత ఓ షూటింగ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు భావను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారని అప్పట్లో వచ్చాయి. ఈ కేసులో మలయాళీ నటుడు దిలీప్ ను నిందితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్ట్ చేయగా.. కొన్నాళ్ల తర్వాత అతడు బెయిల్ పై బయటకు వచ్చారు.ఈ ఘటన పై అప్పట్లో భావన స్పందించలేదు. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన భావన.. 2018లో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం లకు దూరమైన భావన.. ఇటీవలే మలయాళంలో నడికార్ అనే లో నటించింది. అలాగే పలు ల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: