దర్శన్: కన్నడలో మహేష్, పవన్ లాంటి క్రేజ్.. కానీ లైఫంతా వివాదాలే?

Purushottham Vinay
కన్నడ స్టార్ హీరో దర్శన్ మర్డర్ కేసులో అరెస్టయ్యాడనే వార్త కన్నడ పరిశ్రమని ఊపేపిస్తుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ కన్నడలో దర్శన్ కి ఉంది. మహేష్, పవన్ లాగా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి స్టార్స్ వివాదాల్లో చిక్కుకుంటే చాలా కష్టమే. ఒక్క ఈ మర్డర్ కేస్ అనే కాదు ఇప్పుడు దర్శన్ పర్సనల్ లైఫ్ అంతా అలాంటి వివాదాలే ఉన్నాయి.అనేక వివాదాలు దర్శన్ ని చుట్టుముట్టాయి. ఒక సోర్స్ ప్రకారం..దర్శన్ సాధారణంగానే నేర స్వభావం కలిగిన వాడనేది తెలుస్తుంది.అయితే అతని స్టార్ డమ్ ఈ అకృత్యాలన్నింటినీ కూడా కప్పివేసింది. అతను స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని తెలిసింది.


గత 14 ఏళ్ల నుంచి దర్శన్ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కకుంటేనే ఉన్నాడు. అతని భార్యను వేధించడం, భౌతిక దాడికి పాల్పడటం వంటి గృహ హింస కేసులు ఉన్నాయి.ఇక క్రాంతి సినిమాను ప్రమోట్ చేస్తూ దర్శన్ మీడియాతో మాట్లాడుతూ, "అదృష్ట దేవత ఎప్పుడూ మీ తలుపు తట్టదు. కాబట్టి, ఆమె వచ్చినప్పుడు, ఆమెను పట్టుకోండి, ఆమెను లాగి, ఆమెకు బట్టలు ఇవ్వకుండా మీ పడకగదిలో లాక్ చేయండి." అని అతను చేసిన కామెంట్ దుమారం రేపడంతో హోస్పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శన్‌పై ఓ అభిమాని చెప్పు కూడా విసిరాడు.దర్శన్ 2011లో ఆయన భార్య విజయలక్ష్మిపై దాడికి పాల్పడ్డారు. అయితే వారం రోజుల జ్యుడీషియల్ కస్టడీ తర్వాత, విజయలక్ష్మి తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో అతను విడుదలయ్యాడు. ఆమెపై కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఆరోపణలు కూడా గుప్పుమన్నాయి. తరువాత వారి సంబంధం తిరిగి యథావిధిగా ట్రాక్ ఎక్కింది.


కానీ మళ్ళీ 2016 లో భార్య విజయలక్ష్మి మరోసారి పోలీస్ స్టేషన్ పై మెట్లు ఎక్కింది. దర్శన్ ప్రవర్తన ఏమి బాగాలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ తరువాత 2021లో మైసూరులో వెయిటర్‌పై కూడా దర్శన్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2022 లో భరత్ అనే కన్నడ ప్రొడ్యూసర్ దర్శన్ నుంచి సమస్యలున్నట్లు పోలీస్ కేస్ పెట్టాడు. 2023 లో 4 అరుదైన బార్ హెడేడ్ గూస్ అనే పక్షులని ఇల్లీగల్ గా తన ఫామ్ హౌస్ లో పెంచుతున్నట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి కేస్ పెట్టాడు. ఇప్పుడు ఈ 2024 లో తాను ఏఫైర్ పెట్టుకున్న హీరోయిన్ పవిత్ర గౌడకి అభిమాని అస్లీల మెసేజ్లు పంపిస్తూ వార్నింగ్ ఇస్తున్నందుకు అతన్ని దర్శన్ రౌడీలతో కొట్టి చంపించినందుకు పోలీసులు అదుపులో తీసుకున్నారు.  అపారమైన క్రేజ్ ఉన్నా కూడా ఎన్నో వివాదాలు దర్శన్ చుట్టూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: