డూప్ లేకుండా అనుష్క స్టంట్ చేసిన ఏకైక సినిమా..!!

murali krishna
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క కొద్ది కాలంగా బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ వరస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది.  రీసెంట్ గా  సెకండ్‌ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్టును తన అకౌంట్‌లో వేసుకున్నారు.ఈ క్రమంలో ఆమె మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే దర్శకుడు క్రిష్ తో కలిసి  ''ఘాతి''  అనే చిత్రం చేస్తోంది. బాహుబలితో ఆమెకు ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. అవన్ని అనుష్కను పూర్తి స్దాయి బిజీ చేస్తున్నాయి.అనుష్క శెట్టి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ బ్యూటీ . చేతిలో సినిమాలు ఉన్న సినిమాలు లేకపోయినా .. తన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం అస్సలు తగ్గదు.బ్యూటిఫుల్ హీరోయిన్ ..మరి ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు . కాగా అనుష్క శెట్టి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించింది . ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి .. ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది.రీసెంట్గా ఆమెకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కార్తిక్ కి జోడిగా అలెక్స్ పాండ్యా అనే మూవీలో నటించిన అనుష్క శెట్టి ఈ సినిమాలో డూప్ అందుబాటులో లేకపోవడంతో ఆమె రియల్ గా స్టంట్ చేసిందట . ఆశ్చర్యమేంటంటే అనుష్క తన కెరియర్లో డూప్ లేకుండా నటించిన ఏకైక సినిమా ఇదే కావడం గమనార్హం . అనార్కలి డ్రస్సులో మూవీ ట్రైన్ ఎక్కినట్లు ఓ ఈవెంట్లో స్వయంగా కార్తినే ఈ విషయాన్ని బయటపెట్టాడు .
ఆమె చాలా కమిట్మెంట్ గల వ్యక్తి అంటూ పొగిడేసారు . ఆ రోజు డూప్ షూటింగ్ కి రాలేక ఆగిపోయారట .. ఆ సమయంలో అనుష్క కానీ నో చెప్పుకుంటే నిర్మాతలకు చాలా నష్టం వచ్చేదట . నిర్మాతలు బాధపడకూడదు నష్టపోకూడదు అన్న కారణంగా అనుష్క శెట్టి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం అప్పట్లో అభిమానులను మెమరైజ్ చేసింది . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అనుష్క ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాము అంటూ తెగ పొగిడేశారు . కాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క తెరపై కనిపించలేదు. త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి . అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తుంది అనుష్క శెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: