నాని సరిపోదా శనివారం నుండి ఫస్ట్ సింగిల్.. ఎప్పుడంటే..!?

Anilkumar
అష్టా చమ్మా, రైడ్, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, వంటి వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు నాచురల్ స్టార్ నాని. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలను  ఖాతాలో వేసుకున్నాడు. తన నటన, ఎక్స్ప్రెషన్స్, కామెడీ ఆయన కన్నింగ్ స్మైల్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. పోయిన ఏడాది లో దసరా, హాయ్ నాన్న సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. అంతేకాకుండా

 ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా మార్మోగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని "సరిపోదా శనివారం" మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య  కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఈ చిత్రం అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ గా రాబోతోంది. ఇందులో నాని సూర్య రఫ్ లుక్ పాత్రలో అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ అడ్వెంచర్ సినిమాని డివివి ఎంటర్ టైన్మెంట్ వారు బ్యానర్ పై  డివివి

 దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీ టీం వారు తాజాగా మ్యూజిక్ ప్రమోషన్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని జూన్ 15న మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాకుండా జేక్స్ బిజీ   అద్భుతమైన ఆల్బమ్ నీ కంపోస్ట్ చేశారు. ఇక ఇందులో డివోపి గా మురళి పనిచేస్తుండగా కార్తిక శ్రీనివాస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి పలు భాషలలో ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: