శ్రీలీల బాలీవుడ్ మ్యానియా !

Seetha Sailaja
టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో క్రితం సంవత్సరం శ్రీలీల మ్యానియా బాగా కనిపించింది. అయితే ఆమె నటించిన సినిమాలు వరసగా ఫెయిల్ అవ్వడంతో ఆమె పై ఐరన్ లెగ్ సెంటిమెంట్ ముద్రపడి ఆమె స్పీడ్ బాగా తగ్గింది. దీనికితోడు నటిగా కంటే డాన్సర్ గా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడటంతో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో ఆమె నటించి మెప్పించగలదా అన్నసందేహాలు కొందరికి కలుగుతున్నాయి.

దీనికితోడు ఈసంవత్సరం ఈమె మహేష్ తో నటించిన ‘గుంటూరు కారం’ ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో టాప్ హీరోల దృష్టి ప్రస్తుతం ఈమె పై లేదు. ఇప్పుడు ఈమె పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తున్నప్పటికీ ఈమూవీ మళ్ళీ ఎప్పుడు పూర్తి అవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు. లేటెస్ట్ గా ఆమె తమిళ టాప్ హీరో విజయ్ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్’ మూవీలో ఐటమ్ సాంగ్ చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ ఆమె తిరస్కరించింది అన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈపరిస్థితుల మధ్య శ్రీలీల కెరియర్ స్లో అయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఎవరు ఊహించని విధంగా ఆమె బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం శ్రీలీల బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయింది అన్నవార్తలు వినిపిస్తున్నాయి.

‘దేవర’ మూవీలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాల అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు తన కొడుకు ఇబ్రహీం ను బాలీవుడ్ లో క్రేజీ యంగ్ హీరోగా మార్చాలని సైఫ్ ప్రయత్నిస్తున్నాడు. శ్రీలీల డాన్సింగ్ స్కిల్స్ గురించి తెలుసుకుని ఈమూవీ నిర్మాతలు ప్రత్యేకంగా శ్రీలీలను బాలీవుడ్ ఎంట్రీకి ఆఫర్ ఇచ్చారని టాక్. ఇప్పటికే సాయి పల్లవి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి శ్రీలీల కూడ చేరడంతో ఆమె అదృష్టం ఎలా ఉందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: