తేడా కొడుతున్న కంగువ.. ఇప్పట్లో కష్టమే?

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సూర్య 42 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నాడు.మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ గ్లింప్స్ వీడియో, పోస్టర్లు నెట్టింట వైరల్ అయ్యి సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే దానిపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉండగా.. తాజాగా ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట బాగా హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ విషయంలో సాటిస్ఫై అయ్యేదాకా రిలీజ్ డేట్ ప్రకటించేదే లేదని మేకర్స్ నుంచి సమాచారం తెలుస్తుంది. తెలుస్తున్న ఈ మూవీ  దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయబోతుందంటూ ఓ వార్త ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం అక్టోబర్‌ 31న కంగువ రిలీజ్‌కు ప్లాన్ అనేది నడుస్తోంది.


ఇక ఇదే రోజున మరో బిగ్ స్టార్ అయిన అజిత్‌ కుమార్‌ నటిస్తోన్న విడమూయార్చి కూడా విడుదలకు రెడీ అవుతున్నట్టు మరో వార్త వినిపిస్తుంది. మరి ముందుగా వచ్చినట్టుగానే సూర్య సింగిల్‌గా వస్తాడా..? లేదంటే అజిత్‌ కుమార్‌ సినిమా కూడా అదే టైంలో వస్తుందా..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.సూర్య, బాబీడియోల్‌ పోటీ పడి మరీ తమలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు చూపించబోతున్నారని ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ టీజర్ లో గూస్‌ బంప్స్‌ తెప్పించే యాక్షన్‌ సన్నివేశాలతో క్లారిటీ ఇచ్చేశాడు మాస్ డైరెక్టర్‌ శివ. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ఉధిరన్‌ పాత్రలో భయపెట్టించడం ఖాయమని టీజర్‌ చూస్తే అర్ధం అవుతుంది.కంగువలో హాట్ బ్యూటీ దిశాపటానీ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కంగువ ౩డీ ఫార్మాట్‌లో కూడా రిలీజ్ కానుంది. సూర్య కెరీర్‌లో అదిరిపోయే ఆల్బమ్స్ అందించిన రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ మూవీకి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తుండటంతో అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: