పవన్ అభిమానితో బాలయ్య..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది అభిమానులు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో ఒకరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ ఇతను పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. గతంలో ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీకి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా కంటే ముందు పవన్ కి వరుస అపజయాలు ఉన్నాయి. ఈ మూవీ విజయంతో పవన్ తిరిగి ఫుల్ కం బ్యాక్ అయ్యాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే పవన్ , హరీష్ కాంబో లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ స్టార్ట్ అయ్యింది. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నీ మైత్రి సంస్థ వారు నిర్మిస్తుండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కొంత బాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ రాజకీయాలతో బిజీగా కావడంతో హరీష్ , రవితేజ హీరో గా భాగ్య శ్రీ హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని మొదలు పెట్టాడు.

ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి కానుంది. ఇక ఈ మూవీ తర్వాత హరీష్ , పవన్ మూవీ తో పాటు బాలకృష్ణ తో ఏక కాలంలో ఓ మూవీ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో బాగంగా హరీష్ మరికొన్ని రోజుల్లోనే బాలయ్య కి ఒక కథ ను వినిపించానున్నట్లు , అది కానీ ఓకే అయితే హరీష్ , బాలయ్య కాంబో లో మూవీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బేబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: