పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రవితేజ 75వ మూవీ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ హీరోయిన్గగా నటిస్తూ ఉండగా , తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ హిందీ బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి రైడ్ అనే సినిమాకి రీమేక్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే రవితేజ తాజాగా మరో మూవీ ని స్టార్ట్ చేశాడు. శ్రీ విష్ణు హీరోగా రెబా మౌనిక జాన్ హీరోయిన్ గా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో సామజవరగమన అనే సినిమా రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు భాను భోగవరపు కథ రచయితగా పని చేశాడు. ఇకపోతే ఈయన రవితేజ 75 వ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఈ రోజు అనగా జూన్ 11 వ తేదీన రవితేజ 75 వ సినిమా పూజాకార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్య దేవర నాగ వంశీ , సాయి సౌజన్యలు రవితేజ 75 ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీ లీల కనిపించబోతోంది. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమాలకు శ్రీ లీల కూడా వచ్చింది. ఇకపోతే కొంత కాలం క్రితం రవితేజ , శ్రీ లీల కాంబోలో ధమాకా అనే మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. అలాగే వీరి జంటకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ సినిమాతో ఈ జంట మరో విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: