కల్కి 2898 ఏడి: అందరి చూపు కమల్ వైపే?

Purushottham Vinay
కల్కి 2898 ఏడీ మూవీలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారని ఈ మూవీకి సంతకం చేసినప్పటి నుంచి అనేక రకాల వార్తలు వస్తున్నాయి.అయితే... ఇప్పటి దాకా ఆయన లుక్ ని ఒక్కసారి కూడా విడుదల చేయలేదు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో కమల్ హాసన్ లుక్ జస్ట్ ఫేస్ మాత్రమే మేకర్స్ చూపించడం జరిగింది.'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఎంత కిక్ నిచ్చిందో... అంత కంటే ఎక్కువ కిక్ కమల్ అభిమానులకు ఇచ్చిందని చెప్పాలి. నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఏరి కోరి మరీ లోక నాయకుణ్ణి ఎందుకు ఎంపిక చేశారో ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా అర్థం అవుతుంది.రెగ్యులర్ రోల్స్ కంటే డిఫరెంట్ రోల్స్ చేయడానికి కమల్ హాసన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. తెరపై కొత్తగా కనిపించడానికి, ప్రయోగాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు.


 ప్రోస్థటిక్ మేకప్ అనేది ఆయనకు కొత్త కాదు. 'భారతీయుడు' సినిమా కోసం 60 ఏళ్ల వయసు మీరిన వ్యక్తిగా ఓల్డ్ లుక్ కోసం ప్రోస్థటిక్ మేకప్ ని వాడారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ'తో పాటు 'ఇండియన్ 2' కోసం మరొకసారి వాడారు.'కల్కి' సినిమా ట్రైలర్ చూసిన తర్వాత కమల్ అభిమానులకు, ప్రేక్షకులకు వచ్చిన సందేహం ఆయన ఏలియన్ రోల్ చేస్తున్నారని అనుకుంటున్నారు. కొంత మంది ప్రేక్షకులు అయితే కమల్ హాసన్ ని గుర్తు పట్టలేదు కూడా! 'ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి' అని హీరోయిన్ దీపికా పదుకోన్ డైలాగ్ చెబుతారు కదా! అప్పుడు... ట్రైలర్లో సరిగ్గా 2.40 నిమిషాల దగ్గర కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చారు.'భయపడకు... మరో ప్రపంచం వస్తోంది' అని కమల్ హాసన్ డైలాగ్ ఒకటి చెప్తారు. ఆ సీన్ లో గుండుతో డిఫరెంట్ లుక్కులో కనిపించారు. దాంతో కమల్ హాసనే అసలు విలన్ కలి అనేది ఆ మాటతో కన్ఫర్మ్ చేసుకుంటున్నారు కొందరు. ఈ సినిమాలో నాగ్ అశ్విన్ కలి కాలంలో కలి ఇంకా కల్కి మధ్య జరిగే యుద్దాన్ని చూపించబోతున్నాడని అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: