కల్కి 2898 ఏడి: కల్కి ఎవరు? అసలు స్టోరీ ఇదేనా?

Purushottham Vinay
కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన కల్కి ప్రపంచాన్ని చూసి అందరూ కూడా తెగ ఫిదా అయిపోతున్నారు.నాగ్ అశ్విన్ టాలెంట్ వేరే లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న విజువల్స్, గ్రాఫిక్స్, మేకింగ్ చూసి సినీ క్రిటిక్స్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు నాగ్ అశ్విన్ టాలెంట్ అదుర్స్ అని చెబుతున్నారు.అయితే ట్రైలర్ ని చూస్తుంటే.. ఈ మూవీ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. ఇందులో అదిరిపోయే గ్రాఫిక్స్ తో కొత్త ప్రపంచాన్ని చూపించారు మేకర్స్. మహాభారతం నుంచి ఈ సినిమా కథ మొదలు అవుతుందని ఇప్పటికే చాలా సార్లు నాగి తెలిపారు. ఇప్పుడు ట్రైలర్ లో భూమిపై మొదటి నగరం, చివరి నగరం కాశీ.. పైన నీరు ఉంటుందట. భూమిపై ఉన్నదంతా పీల్చేస్తే అంతా అక్కడే ఉంటుందని అంటూ వచ్చిన డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సూపర్ హీరో భైరవగా కనిపించారు. తన యాక్టింగ్, డైలాగ్స్ తో బాగా అలరించారు. అయితే విష్ణుమూర్తి పదో అవతారం కల్కి కథే ఈ మూవీ కథ అంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ కల్కి కూడా ప్రభాసేనని టాక్ గట్టిగా వినిపించింది.అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ వార్తలన్నీ నిజం కావని తెలుస్తోంది.


ఈ సినిమా కథ అంతా కూడా చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు.ట్రైలర్ ని బట్టి అర్ధం అయ్యిందేంటంటే గాలి, నీరు, ఆహారం పుష్కలంగా ఉండే కాంప్లెక్స్ ప్రాంతానికి ప్రభాస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. గర్భవతిగా ఉండే దీపికను తీసుకొచ్చేందుకు ప్రభాస్ వెళ్తాడు. ఆమెను కాపాడుతున్న అశ్వత్థామ రోల్ లో ఉన్న సీనియర్ హీరో అమితాబ్ తో యుద్ధం చేస్తాడు. నువ్విప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మా, సృష్టిని, నేను కాపాడతానని అశ్వత్థామ అమితాబ్ దీపికకు చెప్తాడు. ఆ తర్వాత ట్రైలర్ లో దీపిక, ప్రభాస్ మాట్లాడుతున్నట్లు.. అమితాబ్ తో ఓ చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నట్లు కూడా చూపించారు.దీంతో ఆ పిల్లవాడే కల్కి అయ్యి ఉంటాడని, అతడికి దీపిక జన్మనిచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ అశ్వత్థామ బాధ్యతలను భైరవ తీసుకుంటాడని అంటున్నారు. అక్కడితో సినిమాతో పూర్తి చేసి, తర్వాత పార్ట్ లో మిగతా కథను కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది. ఇదే కల్కి అసలు కథ అని ఇప్పుడు నెట్టింట ప్రచారం సాగుతోంది. మరి ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటి? అసలు కల్కి ఎవరనేది తెలియాలంటే జూన్ 27వ తేదీ దాకా వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: