కల్కి2898ఏడి: దిశాపటానితో పెద్ద ప్లానే వేశారుగా?

Purushottham Vinay
ఒక్క బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే గ్లామరస్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ ఎవరయ్యా అంటే అందరికి వెంటనే గుర్తొచ్చే పేరు దిశా పటాని. ఈ హాట్ బ్యూటీ కెరియర్ ఆరంభంలో తెలుగులో లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా నటించింది.ఆ తరువాత ఆమె హాట్ నెస్ వల్ల ఆమెకి హిందీలో వరుస అవకాశాలు రావడంతో సౌత్ వైపు దృష్టి పెట్టలేదు. ఇక అక్కడ కమర్షియల్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. అయితే దిశా పటానికి సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే ఇన్ స్టాగ్రామ్ ద్వారానే ఎక్కువ పాపులారిటి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న ఇండియన్ హీరోయిన్స్ లో దిశా పటాని ఖచ్చితంగా టాప్ లో ఉంటుంది. ఆమెకి ఏకంగా 50 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్, హాట్ ఫోటోషూట్ లతో తెగ సందడి చేస్తూ ఉంటుంది.పైగా సినిమాలలో కూడా దిశా పటాని ఎక్కువగా గ్లామర్ రోల్స్ లలో మాత్రమే కనిపిస్తోంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు ఇప్పటిదాకా పెద్దగా చెయ్యలేదు. అయితే ఆమె మరీ అంత బ్యాడ్ నటి అయితే కాదు. కానీ దర్శక నిర్మాతలు మాత్రం దిశా పటానిలో ఎక్కువగా గ్లామర్ యాంగిల్ నే చూస్తారు. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ డార్లింగ్ ప్రభాస్ కి జోడీగా కల్కి 2898 ఏడీ సినిమాలో నటించింది.


తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా దిశా పటాని ఓ ఫ్రేమ్ లో కనిపించి ఆకట్టుకుంది. సినిమాలో ప్రభాస్, దిశా పటాని మధ్య మంచి డాన్స్ బేస్డ్ సాంగ్స్ ఉన్నాయని ఇప్పటికే ఓ మాట బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో కల్కి 2898ఏడీ మూవీలో కూడా దిశా పటాని పాత్ర అలాగే ఉంటుందనే సమాచారం తెలుస్తుంది. పైగా ట్రైలర్ లో ఆమె లుక్ కూడా కొత్తగా ఉంది. నుదుటి మీద బొట్టు చూస్తే సంప్రదాయంగా ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే మోడరన్ అమ్మాయిలా కొత్తగా ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన సినిమాలలో క్యాస్టింగ్ విషయంలో చాలా పెర్ఫెక్ట్ గా ఉంటాడు. తన సినిమాలలో ఉన్న ప్రతి పాత్రకి కథలో ఏదో ఒక విధమైన ప్రాధాన్యత అనేది ఉంటుంది. అనవసరంగా క్యారెక్టర్స్ ని ఏదో గ్లామర్ షో కోసం పెట్టుకునే డైరెక్టర్ మాత్రం కాదు. అందుకే కల్కి 2898 ఏడీ సినిమాలో కూడా దిశా పటానికి మంచి పెర్ఫార్మెన్స్ ఉందని సమాచారం తెలుస్తుంది. అలాగే గ్లామర్ పరంగా కూడా సినిమాకి అదనపు అస్సెట్ గా దిశా పటానికి ఉపయోగించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఏది ఏమైనా దిశా పటాని తెలుగులో చేస్తోన్న రెండో సినిమాలో ఏ మేరకు తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుందనేది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: