సికిందర్: లైఫ్లో ఫస్ట్ టైం కష్టపడుతున్న సల్మాన్ భాయ్?

Purushottham Vinay
సల్మాన్ ఖాన్ గురించి తెలిసిందే. ఏ సినిమా అయినా డెడికేషన్ తక్కువ డూప్ ఎక్కువ. సినిమా కోసం మినిమం ఎఫర్ట్ కూడా పెట్టడు భాయ్. కానీ ప్రస్తుతం వరుస ప్లాపుల కారణంగా భాయ్ కష్టపడాలని ఫిక్స్ అయ్యాడు. సల్మాన్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ లో సికందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాయ్ కి జోడీగా హాట్ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోంది.సూపర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మురగదాస్ మార్క్ చిత్రంగా హైలైట్ చేస్తున్నారు. నాలుగేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ మురగదాస్ కెప్టెన్ కుర్చి ఎక్కి చేస్తోన్న చిత్రం కావడంతో కథలో లోతైన విశ్లేషణ ఉంటుందని ఫ్యాన్స్ గెస్ చేస్తున్నారు.తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. ఆ విషయాన్ని సినిమా నిర్మాత సాజిద్ నడియావాలా రివీల్ చేస్తూ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ` ఈనెల 18 న సికందర్ యాక్షన్ ప్రారంభం కానుంది. మొదటి రోజున అతిపెద్ద ఎయిర్ యాక్షన్ సీక్వెన్స్ ని మేం షూట్ చేస్తున్నాం` అని హింటిచ్చారు.


అయితే ఆ సన్నివేశం ఎలా ఉంటుంది? అన్నది ఇంకా రివీల్ చేయలేదుగాని భాయ్ మాత్రం కాస్త బాడీకి వర్క్ చేయబోతున్నాడు.పైగా చిత్ర వర్గాల నుంచి ఇది సాధారణ యాక్షన్ సీక్వెన్స్ కాదని తెలుస్తోంది. సముద్ర మట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో షూట్ చేయబోయే ఓ వైమానిక యాక్షన్ ఎపిసోడ్ అట ఇది. ఇంతవరకూ ఇంత ఎత్తులో యాక్షన్ సీన్స్ చిత్రీకరించలేదు. ఎయిర్ స్పేస్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ ఎవరూ కూడా ఇంతటి సాహసాన్ని చేయలేదు. తొలిసారి మురగదాస్ ఈ రకమైన భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారని తెలుస్తోంది.ఇక మురగదాస్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో సైతం బోలెడంత క్రియేటివిటీ ఉంటుంది. అవి అంతే కన్విన్సింగ్ గానూ అనిపిస్తాయి.ఈ భారీ యాక్షన్ సీన్స్ చేస్తున్న నేపథ్యంలో సినిమాకే ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: