చాలా రోజుల తర్వాత బుల్లితెరపై కలిసి కనిపించిన సిరి, శ్రీహన్..!?

Anilkumar
బుల్లితెర పై లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్న సిరి హనుమంతు శ్రీహాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట యూట్యూబ్ లో పలు వీడియోలు కవర్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు ఈ జంట. అయితే మొదట వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత నిజంగానే ప్రేమలో పడ్డారు. ఇక ఆ మధ్యకాలంలో శ్రీ హనుమంతు బిగ్ బాస్ షో కి కూడా వెళ్ళింది. ఇక అందరూ షణ్ముక్ తో కలిసి మితిమీరి ప్రవర్తించింది. దీంతో వీరి ప్రేమకి ఎండ్ కార్డ్ పడుతుంది ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీళ్ళిద్దరి

 మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. కానీ షణ్ముఖ్ ప్రేమ మాత్రం అనుకున్నట్టుగానే జరిగింది. ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న షణ్ముఖ్ దీప్తి సునయన ఇద్దరు విడిపోయారు. సిరి హనుమంతు చేసిన పనికి దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ వారి వ్యక్తిగత జీవితాలతో బిజీగా ఉన్నారు. అయితే అప్పుడప్పుడు పలు షోలలో కనిపిస్తూ ఉంటారు శ్రీ శ్రీహాన్ జంట. ఇక అందరూ వీళ్ళిద్దరి ఓవరాక్షన్ చూడలేక చచ్చిపోవాల్సిందే .అయితే తాజాగా వీళ్ళిద్దరూ మరొక టీవీ షో కి హాజరయ్యారు. ఆ విషయాలు

 ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సర్కార్ సీజన్ 4కి జోడీగా వచ్చారీ ప్రేమ పక్షులు. తమ ఆటాపాటలతో ఫ్యాన్స్ కు మంచి సర్ ప్రైజ్ ఇచ్చారు. మొదట సిరి హన్మంతు షోలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత శ్రీహాన్ తనదైన స్టైల్ లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యాంకర్ సుధీర్ పై పంచులు, కౌంటర్ల వర్షం కురిపించారు. ఇక షోలో సిరి, శ్రీహాన్ ల రొమాన్స్ చూసి సుడిగాలి సుధీర్ షాక్ అయ్యాడు. ఇక రీల్ లైఫ్ అయినా, రియల్ లైఫ్ లో అయినా ఎంతో సరదాగా ఉంటాడు శ్రీహాన్. తాజాగా సర్కార్ సీజన్ 4 షోలోనూ తన అల్లరి చేష్టలతో అలరించాడు. ముఖ్యంగా తన లవర్ సిరి ముందే.. మరో అమ్మాయికి లవ్ లెటర్ రాయడమే కాకుండా.. చదివి వినిపించాడు. అయితే ఇది సిరిని ఆట పట్టించడానికేనని అర్థమైంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: