అక్కడ మరో రష్మికల మారబోతున్న శ్రీ లీల..!?

Anilkumar
కన్నడ సోయగం టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలు చెసి భారీ గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈమెకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే శ్రీ లీల తెలుగు సినిమాలకి బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ కి మకాం మారుస్తుందా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. అయితే దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉందట. అది

 ఏమిటంటే.. ఒక స్టార్ హీరో కొడుకు సినిమాలో ఈమెకి అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు దానికోసం భారీ మొత్తంలో శ్రీలీలకి చెల్లిస్తున్నట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి. అందుకే చేసేదేమీ లేక త్వరలోనే శ్రీల బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైనట్లుగా వార్తలు వినబడుతున్నాయి. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే తెలుగులో వరుస సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ గత కొద్దిరోజులుగా సినిమాలకి బ్రేక్

 ఇచ్చింది. కేవలం కుర్ర హీరోలతో కాకుండా స్టార్ హీరోలు సీనియర్ హీరోలు సరైన కూడా ఆడి పాడి సినిమాలు చేసింది. ఇక ఆమె కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తయిన తర్వాత ఒక్క కొత్త సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆమె చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నది ఉస్తార్ భగత్ సింగ్ సినిమా ఒక్కటే. ఈ సినిమా తరువాత మాస్ మహారాజా రవితేజ సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోని ఆమె బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే  శ్రీ లీల బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత ఈమెకూడా రష్మిక మందన లాగా మారిపోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: