కాంచన 4 గురించి క్లారిటీ ఇచ్చిన రాఘవ లారెన్స్.. ఎప్పుడంటే..!

Anilkumar
రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ఎన్నో హిట్ అండ్ ఫ్లాప్ సినిమాలు చేస్తూ అభిమానులకు ఎంతో దగ్గర అయ్యాడు. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ గా నిలిచిన కాంచన సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాతో ఆయనకు  క్రేజ్ ఎంతో  పెరిగిపోయింది. ఆయన యాక్టింగ్ తన ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఐ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా కాంచన 2, కాంచన 3 సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు

 దర్శకుడు మరియు నటుడు రాఘవ లారెన్స్. ఇక ఈ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపాయి. అభిమానులు ఈ మూవీస్ ను ఇప్పటికీ చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇక సినిమాలో  లక్ష్మి రాయ్  ,  సరత్కుమార్,కోవై సరళ,దేవదరిని సుకుమార్,శ్రీమాన్,దేవన్ పలువురు ముఖ్య పాత్రలలో నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి తాజా వార్త ఒకటి బయటికి వచ్చింది. అదేంటంటే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో మరొక సినిమా తెరకెక్కబోతుంది.

 అదే కాంచన 4 . ఈ చిత్రం ని తాజాగా రాఘవ అనౌన్స్ చేశారు. ఆ సందర్భంలోనే ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఇక రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాను 2025 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ వార్త విన్న ప్రేక్షకులు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుంటున్న చూడాలి. ఓవైపు డైరెక్టర్‌గా సినిమాలు తీస్తూనే యాక్టర్‌గా కూడా సత్తా చాటుతున్నారు లారెన్స్. గతేడాది రుద్రన్, చంద్రముఖి 2, జిగర్తాండ డబుల్ X చిత్రాలతో ఆడియన్స్‌ను పలకరించారు. ఇందలో భారీ అంచనాలతో రిలీజైన చంద్రముఖి 2 ఆడియన్స్‌ను నిరాశపరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: