అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ యాక్టర్: ఫహద్ ఫాజిల్

Anilkumar
మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ గురించి అందరికీ తెలిసిందే. ఒకవైపు బాలీవుడ్లో మరోవైపు టాలీవుడ్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎన్నో హిట్ అండ్ ఫ్లాప్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే గతేడాదితో పుష్ప సినిమాతో మంచి క్రేజ్ ను అందుకున్నాడు ఫహాద్. తాజాగా ఇప్పుడు పుష్ప 2  సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆయన ఇటీవలే నటించిన ఆవేశం సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక

 మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్  నటించిన మలయాళం సినిమాలు ఈమధ్య వరుస హిట్ లను అందుకుంటున్న నేపథ్యంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. అదేంటంటే ఆయన ఒక వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా తానే చెప్పుకొచ్చాడు. 41 ఏళ్ల వయసులో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ వ్యాధి నిర్ధరణ అయినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. శ్రద్ధ, ప్రస్తావన, ప్రేరణ నియంత్రణను

 నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్  తెలిపారు. అయితే ఇది పిల్లలలో సాధారణమని పెద్దలకు అరుదుగా ఈ వ్యాధి వస్తుంది అన్నారు. అయితే ఈయన తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ వ్యాధి గురించి డాక్టర్ ను అడిగారు. అయితే 41 ఏళ్ల వయసులో దీనికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా లేదా అనే వివరాలు తెలుసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడిన మాటలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప టు సినిమా ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 15న ఈ సినిమాను మేకర్స్ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, టీజర్లు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: