హను రాఘవపూడి తో శ్రీ లీల.. ప్రభాస్ సినిమా కోసమేనా..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ బ్యూటి శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ భారీ గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. గత ఏడాది క్షణం కూడా  తీరిక లేకుండా వరుస సినిమాలు చేసిన ఈమె గుంటూరు కారం సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. గుంటూరు కారం సినిమాతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో ప్రస్తుతం మరో సినిమాకి సైన్ చేయలేదు. అయితే ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో దూసుకుపోయిన

 శ్రీలీలకి ఇప్పుడు ఇతర భాషల్లో కూడా హీరోయిన్గా నటించే అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం ఎక్కువగా తెలుగు సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అంతేకాదు తెలుగు దర్శకుల నుండి సినిమా అవకాశం ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తుంది. తాజాగా శ్రీలీల ఫోటో  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ప్రముఖ దర్శకుడు కూడా ఉన్నారు. అయితే ఇటీవల శ్రీలీల అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొంది. ఈ టీవీ ప్రకటనకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. దీనిపై కొన్ని

 నెలల క్రితమే కలిసి పని చేసారు. అయితే శ్రీలీలను ప్రభాస్ తో సినిమా కోసం హను ఎంపిక చేసి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాకి సంబంధించి క్లాసిక్ డే సెటప్ ప్లాన్ చేసినా కానీ, కొత్త హీరోయిన్‌ని పరిచయం చేయవచ్చు కానీ ఇప్పటికే స్థిరపడిన హీరోయిన్‌లను ఎంపిక చేయకపోవచ్చని కూడా ఒక అంచనా. ఇక శ్రీ లీలకి ప్రభాస్ తో నటించే అవకాశం రాకపోయినప్పటికీ టాలీవుడ్ మాస్ మహారాజ్ నటిస్తున్న సరికొత్త సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ధమాకా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ ఇప్పుడు ఇదే కాంబో రిపీట్ అవ్వడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: