స్పిరిట్: ప్రభాస్ కెరీర్లోనే వేరే లెవెల్ మూవి?

Purushottham Vinay
తెలుగు డైరెక్టర్ సందీప్ వంగా క్రేజ్ 'యానిమల్' సినిమా తర్వాత వేరే లెవెల్ కి పెరిగింది. ఇప్పుడు సందీప్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్. రాజమౌళి తరువాత అలాంటి క్రేజ్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు సందీప్. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా తన పాన్-ఇండియా అప్పీల్‌ను క్రమంగా పెంచుకుంటున్నాడు. ప్రభాస్ తో 'స్పిరిట్' మూవీ కూడా అలాంటి ప్రయత్నమే. ప్రస్తుతం ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ను బాగా అభివృద్ధి చేస్తున్నాడు. డైలాగ్ వెర్షన్ ప్రోగ్రెస్‌లో ఉందని సమాచారం తెలుస్తోంది.'స్పిరిట్' మూవీ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ మూవీలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో కనిపిస్తాడు. ఈ మూవీలో ప్రభాస్ నిజాయితీగల శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. మునుపెన్నడూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించని నిజాయితీ పరుడైన పోలీస్ గా ప్రభాస్ ని సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించబోతున్నాడట.ప్రభాస్ క్యారెక్టర్ డిజైన్ డెప్త్, ఎమోషన్ తో నిండి ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీని యాక్షన్-ప్యాక్డ్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలని సందీప్ భావిస్తున్నందున నిర్మాతలు దాదాపు 300 కోట్ల మేర బడ్జెట్ ని కేటాయిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. స్పిరిల్ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇంకా అలాగే విడుదల తేదీకి సంబంధించిన వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక పోతే ప్రస్తుతం ప్రభాస్ తన సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ 'కల్కి 2898AD' సినిమా ప్రచారంలో ఉన్నాడు. ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషించగా.. దిశా పటానీ, దీపికా పదుకొనే వంటి హాట్ బ్యూటీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. భవిష్యత్ ప్రపంచం ఎలా ఉండబోతోందో నాగ్ అశ్విన్ ఈ మూవీలో ఆవిష్కరించనున్నారు. కల్కి సినిమా విడుదల తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం స్కైని టచ్ చేస్తుంది. ఈరోజు ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది. నేడు భారీ ఈవెంట్ కూడా జరగనుంది.ఈ సినిమా తర్వాత స్పిరిట్ తో ప్రభాస్ క్రేజ్ మరో లెవల్ కి చేరుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: