Nbk -110 : బాలయ్య, బోయపాటి.. డబుల్ హ్యాట్రిక్ లోడింగ్..!

Divya
డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ల ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. ఈ రోజున బాలయ్య పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను కొత్త సినిమాని సైతం ప్రకటించారు. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు కూడా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. కథ క్యారెక్టర్జేషన్లతో వీరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా తీసిన కూడా భారీ విజయాన్ని అందుకుంటూ ఉంటుంది. సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

జూన్ 10వ తేదీన బాలయ్య బర్త్ డే సందర్భంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోయే కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్నది. నిర్మాణ వ్యవహారం పైన రాజీ పడకుండా అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు ఇది 110 సినిమా అన్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేశారు.

బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. నందమూరి అభిమానులే కాదు యావత్ ప్రేక్షకులు కూడా వీరి కాంబినేషన్ సినిమా పైన ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ముఖ్యంగా వీరి కాంబినేషన్లోని వచ్చే డైలాగులు సైతం ఊపు తెప్పించే విధంగా ఉంటాయి. సూటిగా ఎలా చెప్పాలో అలా చెప్పేస్తూ ఉంటారు. ఇప్పటివరకు వీరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా రాజకీయాల ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తోంది. మరి కొత్త సినిమాలు ఏ మేరకు ఉంటుందో అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబి దర్శకత్వంలో 109 వ సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: