HBD: 400 రోజులు ఆడిన బాలయ్య ఏకైక మూవీ..!

Divya
నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు హీరో నందమూరి బాలకృష్ణ.. ఇప్పటికీ ఎన్నో రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రోజున బాలయ్య 64వ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మొదటిసారి బాలకృష్ణ తన తండ్రి దర్శకత్వంలో 1974లో తెరకెక్కించిన తాతమ్మ కల అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. బాలయ్య కూడా తన తండ్రి లాగానే పారాణిక జానపద సాంఘిక చారిత్రాత్మక ఎన్నో చిత్రాలలో నటించి పాపులారిటీ అందుకున్నారు.

బాలయ్య ఇప్పటికి వందకు పైగా సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందిస్తున్న బాలయ్య సీనియర్ హీరోలలో వరుసగా విజయాలు అందుకుంటున్న హీరోగా పేరు పొందారు. బాలయ్య 19 60 జూన్ 10వ తేదీన ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు జన్మించారు. చిన్న వయసు నుంచే తన తండ్రి అడుగుజాడలలో పెరిగిన బాలయ్య అదే విధంగానే చైల్డ్ యాక్టర్ గా కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

బాలయ్య కెరియర్ లో ఎన్నో చిత్రాలలో నటించిన మంగమ్మగారి మనవడు సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది ఆ తర్వాత బాలయ్య స్టార్డం అందుకొని అప్పటి హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేశారు. ముద్దుల మామయ్య, సీతారామ కళ్యాణ, నారీ నారీ నడుమ మురారి, బొబ్బిలి సింహం, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి ,లక్ష్మీనరసింహ తదితర చిత్రాలలో కూడా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే బాలయ్య కెరియర్లు విభిన్నమైన చిత్రంగా పేరు పొందిన చిత్రం ఆదిత్య 369.. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ తో మరింత క్రేజ్ పెరిగింది.. అలాగే భైరవద్వీపం వంటి జానపద చిత్రంతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ఒక థియేటర్లో 400 రోజులకు పైగా ఆడి రికార్డు సైతం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: